అనంతపురం జిల్లా వజ్రకరూర్ వద్ద ఓ దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అనంతపురం: అనంతపురం జిల్లా వజ్రకరూర్ వద్ద ఓ దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓ కేసులో రెండు రోజుల క్రితం వల్లేష్ అనే వ్యక్తిని వజ్రకరూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం వల్లేష్ పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడని పోలీసులు వెల్లడించారు. అయితే.. ఇవాళ ఉదయం అనూహ్యంగా పోలీస్‌స్టేషన్ వద్ద చెట్టుకు వేలాడుతూ వల్లేష్ మృతదేహం కనిపించింది. వల్లేష్ మృతికి కారణం ఏంటి? అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.