మూడిళ్లలో చోరీ | theft in three houses | Sakshi
Sakshi News home page

మూడిళ్లలో చోరీ

Mar 3 2017 9:49 PM | Updated on Sep 5 2017 5:06 AM

మూడిళ్లలో చోరీ

మూడిళ్లలో చోరీ

గుత్తి పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో గురువారం అర్ధరాత్రి తర్వాత మూడిళ్లలో దొంగలు పడ్డారు.

గుత్తి (గుంతకల్లు) : గుత్తి పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో గురువారం అర్ధరాత్రి తర్వాత మూడిళ్లలో దొంగలు పడ్డారు. హరి అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి అహోబిలం వెళ్లాడు. తాళం వేసిన వీరి ఇంటిలోకి దుండగులు ప్రవేశించి బీరువాలో రెండు జతల బంగారు కమ్మలు, రూ. 5 వేల నగదు అపహరించారు.

ఇదే కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఆదిశేషయ్య ఇళ్లలో కూడా దొంగలు పడ్డారు. వీరిళ్లలో నగదు, బంగారు ఆభరణాలు లేకపోవడం వల్ల కొన్ని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కాలంలో గుత్తి, గుత్తి ఆర్‌ఎస్‌లలో చోరీలు అధికంగా జరుగుతున్నాయి. పోలీసులు రాత్రి సమయాల్లో నిఘా, గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement