పట్టణంలోని కెనరాబ్యాంకులో గురువారం దొంగలు చోరీకి యత్నించారు. బ్యాంకు వినియోగదారులు ,బ్యాంకు మేనేజర్ వారిని గుర్తించడంతో దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు.
తాడిపత్రి టౌన్: పట్టణంలోని కెనరాబ్యాంకులో గురువారం దొంగలు చోరీకి యత్నించారు. బ్యాంకు వినియోగదారులు ,బ్యాంకు మేనేజర్ వారిని గుర్తించడంతో దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే దొరికిన ఒక దొంగకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసుస్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని ఆర్‌అండ్‌బి సమీపంలోని కెనరా బ్యాంకు గురువారం ఉదయం వినియోగదారులతో రద్దీగా ఉంది.
అదే సమయంలో కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన వెంకటేసు, శివ అనే దొంగలు బ్యాంకులో చోరీ యత్నానికి వచ్చారు. బ్యాంకులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని బ్యాంకు మేనేజర్ ఓబుళరెడ్డితో పాటు కొందరు వినియోగదారులు ప్రశ్నించడంతో వారు పారిపోయేందుకు యత్నించారు. అయితే వెంకటేసు అనే దొంగ దొరకగా మరో దొంగ పారిపోయాడు. వెంకటేసుకు బ్యాంకు ఖాతాదారులు దేహశుద్ధి చేసి పట్టణ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు వెంకటేసును విచారిస్తున్నారు.