బండల ఫ్యాక్టరీ కార్మికుడు ఆత్మహత్య | The stone factory worker committed suicide | Sakshi
Sakshi News home page

బండల ఫ్యాక్టరీ కార్మికుడు ఆత్మహత్య

Aug 21 2017 10:02 PM | Updated on Nov 6 2018 8:08 PM

తాడిపత్రి మండలం ఆవులతిప్పాయపల్లి సమీపంలోని చుక్కలూరు పరిశ్రమ వాడకు చెందిన బాలుడు(45) అనే బండల ఫ్యాక్టరీ కార్మికుడు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బండిఆత్మకూరుకు చెందిన బాలుడు కొనేళ్లుగా చుక్కలూరు పరిశ్రమ వాడలో నివాసముంటున్నాడు.

తాడిపత్రిరూరల్‌: తాడిపత్రి మండలం ఆవులతిప్పాయపల్లి సమీపంలోని చుక్కలూరు పరిశ్రమ వాడకు చెందిన బాలుడు(45) అనే బండల ఫ్యాక్టరీ కార్మికుడు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బండిఆత్మకూరుకు చెందిన బాలుడు కొనేళ్లుగా చుక్కలూరు పరిశ్రమ వాడలో నివాసముంటున్నాడు. బండల ఫ్యాక్టరీలో కార్మికునిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలుడుకు అప్పులు పెరిగిపోయాయి. ఈ విషయమై భార్య లక్ష్మీదేవితో గొడవ పడ్డాడు. మనస్థాపం చెందిన బాలుడు ఆవులతిప్పాయపల్లి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్‌ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement