నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పంట పొలాల్లో మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పట్టణానికి చెందిన జగన్నాథం చిన వెంకటయ్య(34)గా గుర్తించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.