రుణభారంతో రైతు బలవన్మరణం | The farmer committed suicide . | Sakshi
Sakshi News home page

రుణభారంతో రైతు బలవన్మరణం

May 26 2016 11:46 AM | Updated on Oct 1 2018 2:36 PM

రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం పట్టపహాడ్‌లో కుమ్మరి వెంకటయ్య(38) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం పట్టపహాడ్‌లో కుమ్మరి వెంకటయ్య(38) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్యకు రెండెకరాల మామిడితోట, ఎకరం పొలం ఉన్నాయి. పొలంలో గడ్డి సాగు చేసి, ఇటీవల కొనుగోలు చేసిన జర్సీ ఆవులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల బోరు అడుగంటి మామిడితోట ఎండిపోయింది. అప్పు చేసిన కొనుగోలు చేసిన జర్సీ ఆవు మృత్యువాతపడింది. రూ.3 లక్షల వరకు ఉన్న అప్పులను ఎలా తీర్చాలో తెలియక వెంకటయ్య ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తన మామిడితోటలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.




 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement