ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడిపండ్లు కిలో 3లక్షలు..! | Rs. 3 lakh per kg mango In Rangareddy | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడిపండ్లు కిలో 3లక్షలు..!

Jun 1 2026 8:17 AM | Updated on Jun 1 2026 7:33 PM

Rs. 3 lakh per kg mango In Rangareddy

రంగారెడ్డి జిల్లా: సాధారణంగా మామిడిపండ్లు రకాలను బట్టి కిలో రూ.50 నుంచి రూ.300 వరకు మార్కెట్‌లో లభిస్తాయి. కానీ ప్రపంచంలోనే అతి ఖరీదైన ‘మియాజకి’రకం ధర కిలో సుమారు రూ.2.70 లక్షలు ఉంటుంది. ఈ అరుదైన రకం పండ్లు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ నగర శివారులోని మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి రెవెన్యూలోని మతీన్‌ ముజదదికి చెందిన ఫామ్‌హౌస్‌లో మొట్టమొదటిసారిగా కాశాయి. 

మియాజకి చాలా అరుదైన రకం అని.. పదేళ్ల క్రితం మామిడి మొక్కను తన సోదరుడు బహుమతిగా ఇచ్చారని.. ఇప్పుడది ఖరీదైన పళ్లను ఇచి్చందని మతీన్‌ తెలిపారు. సౌత్‌ ఇండియాలోనే ఎక్కడా దొరకని ఈ రకం తన ఫామ్‌హౌస్‌లో ఉండటం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణంపై ప్రేమతో.. చెట్లపై మమకారంతో తన ఫామ్‌హౌస్‌లో అరుదైన రకాల మొక్కలు పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. దానికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా అందుకున్నట్లు చెప్పారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement