మెదడువాపు వ్యాధితో బాలుడి మృతి | The boy's death encephalitis | Sakshi
Sakshi News home page

మెదడువాపు వ్యాధితో బాలుడి మృతి

Aug 4 2016 1:44 AM | Updated on Sep 4 2017 7:40 AM

పట్టణంలోని పులేరు రోడ్డులోని బీసీ రెడ్డి కాంపౌండ్‌ సమీపంలో నివాసముంటున్న పురుషోత్తం(6) అనే బాలుడు మెదడు వాపు వ్యాధితో బెంగుళూరులో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు

గోరంట్ల: స్థానిక పట్టణంలోని పులేరు రోడ్డులోని బీసీ రెడ్డి కాంపౌండ్‌ సమీపంలో నివాసముంటున్న పురుషోత్తం(6) అనే బాలుడు మెదడు వాపు వ్యాధితో బెంగుళూరులో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. వివరాలకు గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుడిని  స్థానిక ఆస్పత్రితో పాటు హిందూపురం, బత్తలపల్లి  ఆస్పత్రుల్లో  వైద్యం అందించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు  బెంగుళూరులోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తల్లిదండ్రులు రామకృష్ణ, లక్ష్మిలు తెలిపారు.  వీరి స్వగ్రామం చిలమత్తూరు మండలంలోని బూదిలి శెట్టిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement