కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులు | temple works ongoing | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులు

Oct 7 2016 10:38 PM | Updated on Sep 4 2017 4:32 PM

కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులు

కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ఆలయ అభివృద్ధి పనులు జోరందుకున్నాయి.

యాదగిరికొండ  : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ఆలయ అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ఈనెల 11 వ తేదీన దసరా పండుగ సందర్భంగా శిలాస్థాపన చేయనున్నారు. ఉత్తరం దిశలోని సిద్ధమైన రాజగోపురం బేస్‌మెంట్‌పై   ఆరోజు ఉదయం 8ః19 గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. ఈ శిలాస్థాపన వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు చేతుల మీదుగా జరపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇందుకోసం నిర్మాణం పనులను వేగిరం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పనులను వేగవంతం చేయాలనే ఆదేశాల మేరకు రాజగోపురాలను సిద్ధంచేశారు. దక్షిణ రాజగోపురం పనులను ప్రారంభించారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కోసం నేలను చదును చేస్తున్నారు. స్వామి వారి రథాలను తీసి వాటిని శుభ్రం చేస్తున్నారు. గతంలో ఉన్న రథశాలను సైతం తొలగిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement