పస్కర దేవర పూజలు | temple, devapur, tribles | Sakshi
Sakshi News home page

పస్కర దేవర పూజలు

Jul 18 2016 12:12 AM | Updated on Sep 4 2017 5:07 AM

మండలంలోని దేవాపూర్‌ జీపీ పరిధిలోని సమీప గుట్టల్లో ఆదివాసీ గిరిజనులు పస్కర దేవర పూజలు చేశారు. ముందుగా పోచమ్మ దేవతకు పూజలు నిర్వహించి అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి కుటుంబ సమేతంగా వెళ్లి అటవీరాజుల దేవర ప్రతిమలు తయారు చేసి పప్పు పలహారాలు నైవేద్యం పెట్టి సామూహిక పూజలు నిర్వహించారు

కాసిపేట : మండలంలోని దేవాపూర్‌ జీపీ పరిధిలోని సమీప గుట్టల్లో ఆదివాసీ గిరిజనులు పస్కర దేవర పూజలు చేశారు. ముందుగా పోచమ్మ దేవతకు పూజలు నిర్వహించి అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి కుటుంబ సమేతంగా వెళ్లి అటవీరాజుల దేవర ప్రతిమలు తయారు చేసి పప్పు పలహారాలు నైవేద్యం పెట్టి సామూహిక పూజలు నిర్వహించారు. వర్షాలు సంవద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గొడ్డుగోదా పశుపక్షాదులను కాపాడాలని మొక్కులు చెల్లించారు. అనంతరం సామూహిక భోజనాలు చేశారు. పూజారులు రొడ్డ లచ్చులు, రొడ్డ రాజం, గిరిజనసంఘాల నాయకులు కొమ్ముల బాపు, రొడ్డ రమేష్, సండ్ర బాపు తదితరులు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement