రాజగోపురాల నిర్మాణ పనులు ప్రారంభం | temple construction works started | Sakshi
Sakshi News home page

రాజగోపురాల నిర్మాణ పనులు ప్రారంభం

Sep 17 2016 10:42 PM | Updated on Sep 4 2017 1:53 PM

రాజగోపురాల నిర్మాణ పనులు ప్రారంభం

రాజగోపురాల నిర్మాణ పనులు ప్రారంభం

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని యాదాద్రి ప్రధానాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని యాదాద్రి ప్రధానాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయానికి సంబంధించిన రాజగోపురాల నిర్మాణాన్ని శనివారం నుంచి ప్రారంభించారు. తూర్పు రాజగోపురం నిర్మాణానికి నేలను చదును చేస్తుండగా, ఉత్తర రాజగోపురం కోసం బెస్‌మెంట్‌ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న పశ్చిమ రాజగోపురాన్ని తొలగించే పనులు వేగవంతమయ్యాయి.  వచ్చే దసరా నాటికి పనులన్నీ పూర్తి చేయాలనే ఆలోచనతో వైటీడీఏ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement