స్థిరంగా పగటి ఉష్ణోగ్రతలు | temperature details | Sakshi
Sakshi News home page

స్థిరంగా పగటి ఉష్ణోగ్రతలు

Mar 3 2017 9:51 PM | Updated on Sep 5 2017 5:06 AM

పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతుండటంతో జిల్లాలో వేసవితాపం కొనసాగుతోంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతుండటంతో జిల్లాలో వేసవితాపం కొనసాగుతోంది. శుక్రవారం పామిడి, పుట్టపర్తి, శింగనమల, చెన్నేకొత్తపల్లి మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తచెరువు, రాయదుర్గం, కనగానపల్లి, తనకల్లు, కంబదూరు మండలాల్లో 39 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలుగా కొనసాగింది. జిల్లా అంతటా 16 నుంచి 21 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 66 నుంచి 82, మధ్యాహ్నం 10 నుంచి 18 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement
 
Advertisement
Advertisement