స్థిరంగా ఉష్ణోగ్రతలు | temperature details | Sakshi
Sakshi News home page

స్థిరంగా ఉష్ణోగ్రతలు

Jan 28 2017 11:09 PM | Updated on Sep 5 2017 2:21 AM

రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం కూడా రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీలు, పగలు 29 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 75 నుంచి 90, మధ్యాహ్నం 45 నుంచి 55 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అలాగే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై మడకశిర, అగళి, కూడేరు, తనకల్లు తదితర కొన్ని మండలాల్లో తుంపర్లు పడ్డాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement