రాంగోపాల్‌వర్మ చిత్రపటాలు దహనం | teachers fires on ramgopalvarma | Sakshi
Sakshi News home page

రాంగోపాల్‌వర్మ చిత్రపటాలు దహనం

Sep 6 2016 11:46 PM | Updated on Sep 4 2017 12:26 PM

రాంగోపాల్‌వర్మ చిత్రపటాలు దహనం

రాంగోపాల్‌వర్మ చిత్రపటాలు దహనం

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చిత్రపటాలను యాడికిలో ఉపాధ్యాయులు మంగళవారం దహనం చేశారు.

యాడికి : దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చిత్రపటాలను యాడికిలో ఉపాధ్యాయులు మంగళవారం దహనం చేశారు. పీఆర్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ... గూగుల్‌ ఉండగా ఉపాధ్యాయులు ఎందుకు దండగా.. అంటూ రాంగోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలతో ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

ఆయన ఇలా మాట్లాడటం దారుణమన్నారు. ఉపాధ్యాయులు లేకుండానే ఆయన ఈ స్థాయికి ఎదిగారా? అని ప్రశ్నించారు. ఆయన భేషరతుగా ఉపాధ్యాయులందరికీ క్షమామణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  యూనియన్‌ మండల కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌ఎస్‌ నాయక్, గోపాల్, ప్రతాప్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement