తెలుగుదేశం వార్డు సభ్యుల రాజీనామా | TDP ward members resigns to positions | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం వార్డు సభ్యుల రాజీనామా

Aug 1 2016 12:48 PM | Updated on Aug 10 2018 6:50 PM

కుప్పం టీడీపీ వార్డు మెంబర్లు రాజీనామా చేశారు.

కుప్పం: తమ గ్రామంలో మూడేళ్లుగా అభివృద్ధి జరగడం లేదంటూ కుప్పం మేజర్ పంచాయతీ వార్డు సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. మొత్తం 20 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వార్డు సభ్యులు పంచాయతీలో ఉన్నారు. వీరిలో 16మంది  ప్రజల అవసరాలు తీర్చని పదవులు తమకు వద్దంటూ నిరసనలను తెలిపారు.

ఈ మేరకు రాజీనామా పత్రాలను అందజేసినా.. ఎంపీడీవో తీసుకోవడం లేదని మండల కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వరదరాజు అనే వార్డు సభ్యుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. మిగిలిన సభ్యులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement