ఘనంగా సువర్ణ పుష్పార్చన | suvarna pushparchana in yadadri | Sakshi
Sakshi News home page

ఘనంగా సువర్ణ పుష్పార్చన

Jul 22 2016 6:31 PM | Updated on Sep 4 2017 5:51 AM

ఘనంగా సువర్ణ పుష్పార్చన

ఘనంగా సువర్ణ పుష్పార్చన

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు సువర్ణ పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు సువర్ణ పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేసి ప్రత్యేక సేవలో అధిష్టింపచేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దేవస్థానం ఏర్పాటు చేసిన 108 బంగారు పుష్పాలతో అర్చన చేశారు. సాయంత్రం అమ్మవారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. శివాలయంలో స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. కోడే మొక్కులను చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, సురేంద్రాచార్యులు, శ్రీకాంతాచార్యులు, రాకేశాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్‌ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement