breaking news
narsimhaswami
-
ఘనంగా సువర్ణ పుష్పార్చన
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు సువర్ణ పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేసి ప్రత్యేక సేవలో అధిష్టింపచేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దేవస్థానం ఏర్పాటు చేసిన 108 బంగారు పుష్పాలతో అర్చన చేశారు. సాయంత్రం అమ్మవారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. శివాలయంలో స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. కోడే మొక్కులను చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, సురేంద్రాచార్యులు, శ్రీకాంతాచార్యులు, రాకేశాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న యాదాద్రి విస్తరణ పనులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహాస్వామి దేవస్థాన విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణంలో భూమికి సమాంతరంగా పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి అడ్డుగా వచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించి పనులను వేగవంతం చేస్తున్నారు. బాలాలయంలో ప్రస్తుతం ప్రసాద విక్రయశాల, శాశ్వత పూజల గదులను పూర్తి చేశారు. విస్తరణ పనుల్లో సుమారు 1000 మంది కూలీలు, 200మంది పర్యవేక్షకులు, మరో 200 మంది ఇంజనీర్లు, 250 మంది కంప్యూటర్ ఇంజనీర్లు ఇందులో భాగస్వాములవుతున్నారు.