పెరిగిన సబ్సిడీ గోధుమల ధర | subsidy wheat rate hike | Sakshi
Sakshi News home page

పెరిగిన సబ్సిడీ గోధుమల ధర

Jul 26 2016 11:27 PM | Updated on Sep 4 2017 6:24 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసే గోధుమల ధరను పెంచింది. నాలుగు మాసాలుగా రూ.2లకే కిలో ఇచ్చిన గోధుమల ధరను ఇపుడు రూ.7కు పెంచింది.

  • రూ.2 నుంచి రూ.7కుపెంపు
  • పెద్దపల్లిరూరల్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసే గోధుమల ధరను పెంచింది. నాలుగు మాసాలుగా రూ.2లకే కిలో ఇచ్చిన గోధుమల ధరను ఇపుడు రూ.7కు పెంచింది. గోధుమల «దరను పెంచిన విషయమై రేషన్‌ డీలర్లకు కనీస సమాచారం కూడా ఇవ్వక పోవడం విశేషం. వచ్చే నెల కోటా పొందేందుకు మీసేవా కేంద్రాల్లో కిలోకు రూ.1.80 చొప్పున డబ్బులు చెల్లించగా వారు చెల్లించిన సొమ్మును రూ.6.80తో తీసుకుని కోటా తగ్గించి రశీదు రావడంతో డీలర్లు అవాక్కయ్యారు. ఇప్పటిదాక రూ.2కే కిలో ఇచ్చి వచ్చే నెల నుంచి రూ.7చెల్లించాలని కోరితే లబ్దిదారుల నుంచి ఇబ్బందులు తప్పవని డీలర్లు వాపోతున్నారు. ధర పెరిగిన విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం దారుణమని డీలర్లు పేర్కొన్నారు. 
     
     

Advertisement
 
Advertisement
Advertisement