నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పట్టుదలతో క్రికెట్ ఆడాలని వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ అన్నారు.
విద్యార్థులు పట్టుదలతో క్రికెట్ ఆడాలి
Aug 22 2016 1:11 AM | Updated on Sep 4 2017 10:16 AM
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పట్టుదలతో క్రికెట్ ఆడాలని వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ అన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్కూల్ లెవల్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఆదివారం స్కూల్ స్థాయి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల క్రికెట్‌లో రాణించడానికి దోహదపడతాయన్నారు. క్రీడాకారులు క్రికెట్‌లో మెలకువలు నేర్చుకుంటే క్రీడా పోటీల్లో విజయం సులువవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, టోర్నమెంట్ కన్వీనర్ ఎస్‌డీ. అమీనోద్దీన్, ప్రసన్న, ఎండీ.అలీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement


