విద్యార్థి దుర్మరణం | Student killed in accident | Sakshi
Sakshi News home page

విద్యార్థి దుర్మరణం

Dec 1 2016 11:44 PM | Updated on Nov 9 2018 4:36 PM

విద్యార్థి దుర్మరణం - Sakshi

విద్యార్థి దుర్మరణం

సూళ్లూరుపేట : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ఎస్‌.సమీర్‌ (18) స్థానికంగా ఉన్న సత్యం జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు.

సూళ్లూరుపేట : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ఎస్‌.సమీర్‌ (18) స్థానికంగా ఉన్న సత్యం జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. గురువారం ఉదయం బహిర్భూకి వెళ్లిన సమీర్‌ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న సహచర విద్యార్థులు సమీర్‌ మృతదేహానికి నివాళులర్పించారు.   
 
 

Advertisement
 
Advertisement
Advertisement