ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి | Student dies after fight at college | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి

Jul 10 2016 2:17 PM | Updated on Sep 4 2017 4:33 AM

ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలయ్యాడు. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

జనగామ (వరంగల్) : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలయ్యాడు. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్(16)ను రెండో సంవత్సరం చదువుతున్న ఉమేష్ తీరు మార్చుకోమని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ ఈ నెల 3న తేదీన ఉమేష్‌తో గొడవపడి.. పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుమారుడిపై కళాశాలలో దాడి జరిగిన విషయాన్ని దాచిన యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement