breaking news
Vagdevi Junior college
-
వాగ్దేవి కళాశాలకు షోకాజ్ నోటీసులు
జనగామ (వరంగల్) : హాస్టల్లో ఉంటున్న సీనియర్ ఇంటర్ విద్యార్థి ఉమేశ్ మృతి ఘటనపై ఉన్నత విద్యాశాఖ స్పందించి షోకాజ్ నోటీసు జారీ చేసింది. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కళాశాల, హాస్టళ్లను ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి(ఆర్ఐవో) హైమద్ నేతృత్వంలో సోమవారం పరిశీలించారు. హాస్టల్లో దాడి జరిగి విద్యార్థి మృతి చెందేవరకూ ఇంటర్ బోర్డుకు సమాచారం లేకపోవడంపై సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కళాశాలను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కళాశాల డెరైక్టర్ రమేశ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. యాజమాన్యం నుంచి సమాధానం రాకుంటే కాలేజీని సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాగ్దేవితో పాటు జనగామ పట్టణంలో మరో ఐదు ప్రెవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అనుమతి లేకుండా హాస్టళ్లను నడిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. హాస్టళ్లను మూసి వేయకుంటే కళాశాలల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కాగా, వాగ్దేవి కళాశాలను, హాస్టల్‌ను యూజమాన్యం మూసివేసినట్లు సమాచారం. దీంతో పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి
-
ర్యాగింగ్‌కు ఇంటర్ విద్యార్థి బలి
జనగామ (వరంగల్) : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థి బలయ్యాడు. వరంగల్ జిల్లా జనగామలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్(16)ను రెండో సంవత్సరం చదువుతున్న ఉమేష్ తీరు మార్చుకోమని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ ఈ నెల 3న తేదీన ఉమేష్‌తో గొడవపడి.. పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుమారుడిపై కళాశాలలో దాడి జరిగిన విషయాన్ని దాచిన యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.