సాగర్‌కాల్వలో పడి విద్యార్థి మృతి | student died in sagar kenal | Sakshi
Sakshi News home page

సాగర్‌కాల్వలో పడి విద్యార్థి మృతి

Aug 25 2016 7:46 PM | Updated on Nov 9 2018 5:02 PM

నకరికల్లు (గుంటూరు ): సాగర్‌కాల్వలో పడి విద్యార్థి మృతి చెందాడు. ఈసంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో గురువారం జరిగింది.

 
 నకరికల్లు (గుంటూరు ): సాగర్‌కాల్వలో పడి విద్యార్థి మృతి చెందాడు. ఈసంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో గురువారం జరిగింది. సంఘటనకు సంబంధించి స్ధానికులు∙వివరాలు ఇలాఉన్నాయి. గ్రామానికి చెందిన దాచేపల్లి రంజాన్‌ షరీఫ్‌ (12) స్నేహితులతో పాటు గ్రామ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. ఈత రాకపోవడంతో ఊపిరాడక మృ తిచెందినట్టు చెబుతున్నారు. షరీఫ్‌ గ్రామంలోని ఉన్నతపాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మికంగా మృతిlచెందడంతో తల్లిదండ్రులు బాబు, జానమ్మలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement