శ్రీశైలం డ్యాం నీటిమట్టం 853.60 అడుగులు | srisailam dam water level is 853.60 fts | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యాం నీటిమట్టం 853.60 అడుగులు

Jan 26 2017 12:55 AM | Updated on Sep 5 2017 2:06 AM

శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 853.60 అడుగులకు చేరకుంది.

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 853.60 అడుగులకు చేరకుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు రెండు పవర్‌హౌస్‌లలో విద్యుత్‌ ఉత్పాదన అనంతరం 1,459 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 0.613 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 0.132 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 300 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 420 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 88.2691 టీఎంసీల నీరు నిల్వఽ ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement