భవిష్యత్‌ కోసం హోదా అవసరం | Special status necessary for future | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ కోసం హోదా అవసరం

Nov 18 2016 1:20 AM | Updated on Mar 23 2019 9:10 PM

భవిష్యత్‌ కోసం హోదా అవసరం - Sakshi

భవిష్యత్‌ కోసం హోదా అవసరం

నెల్లూరు, సిటీ : భవిష్యత్‌ తరాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు పనబాక లక్ష్మి అన్నారు.

  • మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి
  • నెల్లూరు, సిటీ : భవిష్యత్‌ తరాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు పనబాక లక్ష్మి అన్నారు. నెల్లూరులోని టీకేడబ్ల్యూ కళాశాలలో గురువారం ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలపై ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజనను కాంగ్రెస్‌ ఒక్కటే చేయలేదన్నారు. అప్పుడు అన్నీ పార్టీలతో చర్చించి వారి అంగీకారంతోనే చేసినట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన  600 హామీలు అమలుకాలేదన్నారు.ఽ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సీవీ శేషారెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి, చెంచలబాబుయాదవ్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు కేశవనారాయణ, యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
     
     

Advertisement
 
Advertisement
Advertisement