ప్యాకేజీ పేరిట బీజేపీ, టీడీపీల వంచన | special status issue dcc | Sakshi
Sakshi News home page

ప్యాకేజీ పేరిట బీజేపీ, టీడీపీల వంచన

Sep 17 2016 9:52 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్యాకేజీ పేరిట బీజేపీ, టీడీపీల వంచన - Sakshi

ప్యాకేజీ పేరిట బీజేపీ, టీడీపీల వంచన

ప్యాకేజీల పేరుతో బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. శనివారం ప్రత్యేక హోదా సాధనకు ఆయన రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రయోజనాలే తమను ముఖ్యమని, అందుకే తన పుట్టినరోజు వేడుకలను త్యజించి హోదా కోసం నిరసన వ్యక్తం చేస్తున్నానన

  • డీసీసీ అధ్యక్షుడు కందుల ధ్వజం 
  • ప్రత్యేకహోదా కోసం నిరశన దీక్ష
  • రాజమహేంద్రవరం సిటీ :  
    ప్యాకేజీల పేరుతో బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. శనివారం ప్రత్యేక హోదా సాధనకు ఆయన రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రయోజనాలే తమను ముఖ్యమని, అందుకే తన పుట్టినరోజు వేడుకలను త్యజించి హోదా కోసం నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.  ప్రత్యేక హోదా చచ్చిపోయిందన్న సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వాఖ్యలను ఆయన విజ్ఞతకే వదలివేస్తున్నానన్నారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం పోస్ట్‌కార్డుల ఉద్యమంగా చేపట్టి, కార్డులు వేసేందుకు బాక్స్‌ ఏర్పాటు చేశారు. సాయంత్రం కాంగ్రెస్‌ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. దుర్గేష్‌ నిరశన దీక్షకు వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామసుబ్రమణ్యం, కాంగ్రెస్‌ శిక్షణా శిబిరాల రాష్ట్ర ౖచెర్మన్‌ రామినీడి మురళి, కాంగ్రెస్‌ నాయకులు ఎన్‌వీ శ్రీనివాస్, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బోడా వెంకట్,కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement