పాము కాటుతో విద్యార్థిని మృతి | snake bite..student died | Sakshi
Sakshi News home page

పాము కాటుతో విద్యార్థిని మృతి

Jul 20 2016 5:25 PM | Updated on Sep 4 2017 5:29 AM

పాము కాటుతో విద్యార్థిని మృతి

పాము కాటుతో విద్యార్థిని మృతి

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పాముకాటుకు సౌందర్య(12)అనే విద్యార్థినీ మృతి చెందింది.

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పాముకాటుకు సౌందర్య(12)అనే విద్యార్థినీ మృతి చెందింది. గ్రామానికి చెందిన స్వామిరంగడు, లక్ష్మీల కుమార్తె సౌందర్య పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల ఉన్నతపాఠశాలలో 8 వ తరగతి ‘బి’ సెక్షన్‌లో చదువుతుంది.  కుంటుంబ సభ్యులు అందరు మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. రాత్రి సౌందర్యకు వీపుపైన, చేతుల మీద పాము కాటు వేసింది. కాటు వేసిన విషయం తల్లిదండ్రులకు బాలిక చెప్పింది. రాత్రి  కావటంతో ఏమైనా పురుగు కొరికుంటుందిలే అనుకున్నారు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నాటు వైద్యం కోసం కల్లుదేవకుంట గ్రామానికి వెల్లుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. బాలిక మృతదేహన్ని గ్రామానికి తీసుకువచ్చారు. బాలిక మృతి చెందడంతో సంతాప సూచకంగా పాఠశాలకు మధ్యాహ్నం  సెలవు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement