ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ | Six people arrested for Bingo | Sakshi
Sakshi News home page

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

Jul 24 2016 6:57 PM | Updated on Sep 4 2018 5:21 PM

బోడుప్పల్ ఈదయ్యనగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బోడుప్పల్ ఈదయ్యనగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ఆదివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈదయ్యనగర్‌లో కె. మదన్‌మోహన్‌రెడ్డి(31), జగన్‌రెడ్డి(32), బీరు శివ(28), మాధవరెడ్డి(58), పి. శ్రీనివాస్‌రెడ్డి(38), అవినాష్(22)లు పేకాట ఆడుతున్నారు. ఇది గమనించిన స్థానికులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 8640లు నగదు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement