రాష్ట్ర క్రికెట్‌ ప్రాబబుల్స్‌కు ఆరుగురు ఎంపిక | six elect to state cricket probables | Sakshi
Sakshi News home page

రాష్ట్ర క్రికెట్‌ ప్రాబబుల్స్‌కు ఆరుగురు ఎంపిక

Aug 26 2016 10:05 PM | Updated on Jun 1 2018 8:39 PM

రాష్ట్ర క్రికెట్‌ ప్రాబబుల్స్‌కు జిల్లా నుంచి ఆరుగురు ఎంపికైనట్లు జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు మాంఛో ఫెర్రర్, కార్యదర్శి బి.ఆర్‌. ప్రసన్న ఓ ప్రకటన లో తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : రాష్ట్ర క్రికెట్‌ ప్రాబబుల్స్‌కు జిల్లా నుంచి ఆరుగురు ఎంపికైనట్లు జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు మాంఛో ఫెర్రర్, కార్యదర్శి బి.ఆర్‌. ప్రసన్న ఓ ప్రకటన లో తెలిపారు. ఇటీవల కడపలో జరిగిన ఆంధ్ర అండర్‌–19 అంతర్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీలో అనంతపురం జట్టు విజయకేతనం ఎగురవేసింది.


ఈ టోర్నీలో రాణించిన జిల్లా క్రీడాకారులు గిరినాథ్‌రెడ్డి (ఆల్‌రౌండర్‌), మహబుబ్‌పీరా(ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌), రాజశేఖర్‌ (మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌), ప్రవీన్‌కుమార్‌రెడ్డి (మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌), సంతోష్‌ (లెఫ్ట్‌ ఆర్మ్‌ పేస్‌), ముదస్సీర్‌ (లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌)ఎంపికయ్యారు. ప్రాబబుల్స్‌ మ్యాచ్‌లు విజయవాడ లోని ముళ్లపాడులో నిర్మించిన మైదానంలో ఈ నెల 29 నుంచి 31 వరకు జరుగుతాయన్నారు. జిల్లా నుంచి ఆరుగురు ఎంపిక కావడం పట్ల జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement