breaking news
six elect
-
సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 16, 17 తేదీల్లో హైదరా బాద్ వేదికగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణ కోసం టీపీసీసీ ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు 39 మంది ముఖ్య నేతలతో రిసెప్షన్ కమిటీని నియమించింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు దామోదర రాజనర్సింహ, వంశీచందర్‌రెడ్డిలతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ కమిటీలో చోటు కల్పించింది. మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్‌గా ఏడుగురితో సోషల్ మీడియా కమిటీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ చైర్మన్‌గా ఏడుగురితో ట్రాన్స్‌పోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఖమ్మం మాజీ ఎంపీ, టీపీపీసీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి చైర్మన్‌గా, గాలి అనిల్‌కుమార్ కోచైర్మన్‌గా పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్ కమిటీ, అజారుద్దీన్ చైర్మన్‌గా జీహెచ్ఎంసీ పబ్లిసిటీ కమిటీ, టీపీసీసీ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్ రావు చైర్మన్‌గా ప్రొటోకాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 29 మందిని సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ చదవండి: గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల -
రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఆరుగురు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్‌కు జిల్లా నుంచి ఆరుగురు ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాంఛో ఫెర్రర్, కార్యదర్శి బి.ఆర్. ప్రసన్న ఓ ప్రకటన లో తెలిపారు. ఇటీవల కడపలో జరిగిన ఆంధ్ర అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీలో అనంతపురం జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ టోర్నీలో రాణించిన జిల్లా క్రీడాకారులు గిరినాథ్‌రెడ్డి (ఆల్‌రౌండర్), మహబుబ్పీరా(ఓపెనింగ్ బ్యాట్స్‌మన్), రాజశేఖర్ (మిడిలార్డర్ బ్యాట్స్‌మన్), ప్రవీన్‌కుమార్‌రెడ్డి (మిడిలార్డర్ బ్యాట్స్‌మన్), సంతోష్ (లెఫ్ట్ ఆర్మ్ పేస్), ముదస్సీర్ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్)ఎంపికయ్యారు. ప్రాబబుల్స్ మ్యాచ్‌లు విజయవాడ లోని ముళ్లపాడులో నిర్మించిన మైదానంలో ఈ నెల 29 నుంచి 31 వరకు జరుగుతాయన్నారు. జిల్లా నుంచి ఆరుగురు ఎంపిక కావడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు.