భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం | Siege of Heavily explosives | Sakshi
Sakshi News home page

భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

Nov 28 2015 4:12 PM | Updated on Sep 3 2017 1:10 PM

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన  పోలీసులు ఓ వాహనంలో భారీగా  పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు 1260 జిలిటిన్ స్టిక్స్, 1650 డిటోనేటర్లతో పాటు.. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ పేలుడు పదార్థాలు ఎవరివి.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement