breaking news
Jilitin Sticks
-
జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు
హైదరాబాద్: ఒక్కసారిగా పేలుళ్లు.. దట్టంగా లేచిన దుమ్ము.. భారీ శబ్దాలకు పగిలిన పొరుగు ఇంటి కిటికీలు.. భయంతో స్కూల్ విద్యార్థుల పరుగులు.. చుట్టుపక్కల 400 మీటర్ల మేర గాలిలోకి లేచిన రాళ్లు.. ధ్వంసమైన కార్లు. ఇదీ సోమవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 48లో చోటు చేసుకున్న బీభత్స దృశ్యం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 48లో ప్లాట్ నంబర్ 969లో సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ భవన నిర్మాణపనుల్లో భాగంగా రాళ్లు పగలగొట్టే పనిని ఆశిష్ అనే వ్యక్తి కాంట్రాక్ట్‌కు తీసుకున్నాడు. అతడు మహేందర్ అనే సబ్ కాంట్రాక్టర్‌కు రాళ్లను కొట్టే పనిని అప్పగించాడు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను పెద్ద మొత్తంలో ఓ గదిలో నిల్వ ఉంచాడు. ఉదయం వాచ్‌మన్ ఆశారాం భార్య భగవతి గది ముందు వంట చేస్తుండగా వేడికి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో ఆ గది కుప్పకూలింది. గాలిలోకి రాళ్లు ఎగిరిపడ్డాయి. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి ఎదురుగా ఉన్న వీరేన్‌చౌదరి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. నాలుగు ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. రాళ్లు ఎగిరి అక్కడే ఉన్న ఓ కారుపై పడడంతో అది ధ్వంసమైంది. పేలుళ్ల శబ్దాలకు భయపడి సమీపంలోని చిరక్ ప్లేస్కూల్ చిన్నారులు ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాంబు డిస్పోజల్ టీమ్, క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించాయి. పేలని 98 డిటోనేటర్లు, బండరాయిని ధ్వంసం చేసేందుకు పెట్టిన మరో డిటోనేటర్‌ను బాంబుస్క్వాడ్ వెలికి తీసిందని పోలీసులు తెలిపారు. సుమారు 25 డిటోనేటర్లు పేలి ఉంటాయని పోలీసుల అంచనా. ఈ మేరకు పోలీసులు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. -
జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు
-
భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం
-
భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం
కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు 1260 జిలిటిన్ స్టిక్స్, 1650 డిటోనేటర్లతో పాటు.. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ పేలుడు పదార్థాలు ఎవరివి.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
శక్తివంతమైన రెండు బాంబులు లభ్యం
ధర్మపురి (హొసూరు), న్యూస్‌లైన్: జిలిటిన్ స్టిక్స్, ఫ్యూజ్ వైర్లు ఏర్పాటు చేసిన రెండు భారీ బాంబులను సోమవారం సాయంత్రం ధర్మపురి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. ధర్మపురి జిల్లా మత్తూరు సమీపంలోని కోడియూరు రోడ్డు మీదుగా పాపిరెడ్డిపట్టి, బొమ్మిడి ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆ రోడ్డులో వెళ్తున్న ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు ఓ సంచి నుంచి బయటకు వచ్చిన ఎరుపురంగు కేబుల్స్ కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని అతడు కడత్తూరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేశాడు. సీఐ భాస్కర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వాటిని పరిశీలించి.. జిల్లా ఏస్పీ హాస్రాకర్కు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకొని.. సిబ్బంది సహకారంతో వైర్లను తొలగించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక్కో దానికి 10 జెలిటిన్ స్టిక్‌లు, డిటోనేటర్, వైర్ జోడించిన శక్తివంతమైన బాంబులుగా తేలింది. ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో నక్సల్స్ కదలికలున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ బాంబులు బయట పడటం ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా, విద్యాశాఖ మంత్రి పళనియప్పను హతమారుస్తామంటూ రెండు నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. మూడు రోజుల క్రితం ఆయన ధర్మపురి జిల్లా కడత్తూరులో ‘తాళికి బంగారం’ సమావేశానికి ప్రజా సంక్షేమ శాఖ మంత్రి వళర్మతితోపాటు హాజరయ్యారు. సమావేశం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఈ బాంబులు లభ్యం కావడంతో పోలీసు శాఖ కలవరపాటుకు గురైంది. భారీ స్థాయిలో క్వారీ పేలుళ్ల కోసం వీటిని తీసుకెళ్తూ.. ఎవరైనా పోలీసులను చూసి ఇక్కడ పడేశారా.. అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.