తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మప్రచార మండలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మే 20 నుండి 26వ తేదీ వరకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
వేసవిలో విద్యార్థులకు శుభప్రదం
Apr 18 2017 12:35 AM | Updated on Sep 5 2017 9:00 AM
కర్నూలు(కల్చరల్): తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మప్రచార మండలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మే 20 నుండి 26వ తేదీ వరకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శుభప్రదం పేరుతో 8, 9 తరగతుల విద్యార్థుల కోసం నిర్వహించే ఈ శిక్షణ తరగతుల్లో విద్యార్థులకు నైతిక విలువలు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలపై అవగాహన కల్గించడం జరుగుతుందన్నారు. ప్రతి మండలం నుండి 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేసుకుంటామన్నారు. బాలురు బాలికలకు వేర్వేరు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తులను స్థానిక సి.క్యాంప్‌లోని టీటీడీ కళ్యాణ మండపం కార్యాలయం నుండి పొందవచ్చన్నారు. దరఖాస్తులపై విద్యార్థులు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, లేక తల్లిదండ్రుల సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు. వివరాలకు 94410 08677 నెంబర్‌ను సంప్రదించవచ్చని నిర్వాహకులు సూర్యనారాయణ, మల్లు వెంకటరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement