చిత్తూరులో ఏనుగుల బీభత్సం | Shepherd killed in elephants attack | Sakshi
Sakshi News home page

చిత్తూరులో ఏనుగుల బీభత్సం

Apr 18 2016 11:55 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిచాయి.

 చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గడ్డూరు యానది కాలనీలో సోమవారం వేకువజామున ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. సమీపంలోని అడవి నుంచి వచ్చిన ఏనుగుల గుంపు గ్రామంపై దాడిచేసింది. ఈ సంఘటనలో మురళి కుమారుడు విజయ్(18) అనే యువకుడు మృతిచెందాడు. ఏనుగుల గుంపును తరిమేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు అవి అడవిలోకి వెళ్లిపోయాయి. విషయం తెలిసిన అటవీ అధికారులు గడ్డూరు యానాది కాలనీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement