మొదటి అదనపు జిల్లా జడ్జిగా వి.వి.శేషుబాబు | seshababu as first additional judge | Sakshi
Sakshi News home page

మొదటి అదనపు జిల్లా జడ్జిగా వి.వి.శేషుబాబు

Feb 20 2017 11:53 PM | Updated on Sep 5 2017 4:11 AM

జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రత్యేక విచారణ న్యాయస్థానం, జిల్లా ఆరవ అదనపు న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేస్తున్న వి.వి.శేషుబాబును జిల్లా మొదటి అదనపు జడ్జిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలు(లీగల్‌): జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప్రత్యేక విచారణ న్యాయస్థానం, జిల్లా ఆరవ అదనపు న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేస్తున్న వి.వి.శేషుబాబును జిల్లా మొదటి అదనపు జడ్జిగా నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత అక్టోబర్‌ నుంచి మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉండటంతో ఆ స్థానంలో వి.వి.శేషుబాబును బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నం లీగల్‌ సర్వీస్‌ అథారిటీ జడ్జి వెంకట నాగసుందర్‌ను నియమించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement