మొరాయించిన సర్వర్‌ | server down | Sakshi
Sakshi News home page

మొరాయించిన సర్వర్‌

Dec 29 2016 11:15 PM | Updated on Sep 4 2017 11:54 PM

జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం సర్వస్‌ సమస్య ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం వరకు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి.

- బ్యాంకుల్లో స్తంభించిన లావాదేవాలు
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం సర్వస్‌ సమస్య ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం వరకు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి.  జిల్లాలోని అన్ని బ్యాంకులు అనంతపురం జోన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వర్‌ పరిధిలో ఉన్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకు సర్వర్‌ పనిచేయకపోవడంతో బ్యాంకుల్లో లావాదేవీలు జరగలేదు. కరెన్సీ కొరతతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు. సర్వర్‌ సమస్యతో గురువారం ఇబ్బందులు తప్పలేదు. కొద్దోగొపోప నగదు తీసుకునేందుకు వచ్చిన అన్ని వర్గాల ప్రజలు సర్వర్‌ పనిచేయక  వెనుదిగిరి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement