breaking news
tranactions
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. మరుగునపడ్డ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిపిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ప్రస్తుతం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారనే దానిపై విచారణ చేపట్టనుంది. గతంలో డ్రగ్స్ సరఫరా, వినియోగం వరకూ ఎక్సైజ్ శాఖ దృష్టిపెట్టింది. ఈ కేసులో చికాగో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానిస్తోంది. ఎక్సైజ్‌శాఖ్ నుంచి వివరాలు తీసుకుని ఈడీ విచారించనుంది. చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు -
మొరాయించిన సర్వర్
- బ్యాంకుల్లో స్తంభించిన లావాదేవాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం సర్వస్ సమస్య ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం వరకు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లాలోని అన్ని బ్యాంకులు అనంతపురం జోన్ బీఎస్ఎన్ఎల్ సర్వర్ పరిధిలో ఉన్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో బ్యాంకుల్లో లావాదేవీలు జరగలేదు. కరెన్సీ కొరతతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు. సర్వర్ సమస్యతో గురువారం ఇబ్బందులు తప్పలేదు. కొద్దోగొపోప నగదు తీసుకునేందుకు వచ్చిన అన్ని వర్గాల ప్రజలు సర్వర్ పనిచేయక వెనుదిగిరి వెళ్లారు.