ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామ సమీపంలో అక్రమ ఇసుక డంప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక డంప్ స్వాధీనం
Mar 3 2017 12:24 AM | Updated on Sep 29 2018 5:47 PM
- ఆరుగురిపై కేసు నమోదు
కృష్ణగిరి: ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామ సమీపంలో అక్రమ ఇసుక డంప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సోమ్లానాయక్ తెలిపారు. గ్రామానికి చెందిన హరిజన సుదర్శన్, శేఖర్, వెంకటేశ్వర్లు, లక్ష్మన్న, సుధాకర్, మద్దిలేటి .. గ్రామ సమీపంలోని హంద్రీ నది నుంచి ఇసుకను ట్రాక్టర్‌లతో అక్రమంగా తరలించి డంప్ చేసినట్లు జిల్లా మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి గుర్తించారని, ఆయన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement


