సారిక కేసులో సనా అరెస్టు | Sana arrested in the case of sarika | Sakshi
Sakshi News home page

సారిక కేసులో సనా అరెస్టు

Nov 14 2015 2:02 AM | Updated on Aug 21 2018 5:52 PM

సారిక కేసులో సనా అరెస్టు - Sakshi

సారిక కేసులో సనా అరెస్టు

మాజీ ఎంపీ రాజయ్య కోడ లు, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసులో నాలుగో నిందితురాలు సనను పోలీసులు అరెస్టు చేశారు.

14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
 
 సాక్షి, హన్మకొండ: మాజీ ఎంపీ రాజయ్య కోడ లు, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసులో  నాలుగో నిందితురాలు సనను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనమయ్యారు. ఈ కేసులో సారిక భర్త అనిల్,  మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిలు నిందితులుగా ఉన్నారు. అనిల్ రెండో భార్య సనా ఏ-4 నిందితురాలు. ఘటన జరిగిన రోజు నుంచి ఆమె పరారీలో ఉంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మధ్యవర్తి ద్వారా చంటిపిల్లాడితో సన(26) లొంగిపోయినట్లు హన్మకొండ ఏసీపీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సాయంత్రం ఆమెను వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజి స్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సనకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అంతకుముందు సనకు ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సన మధ్యవర్తి ద్వారా లొంగిపోయినట్లు పోలీసులు పేర్కొన్నప్పటికీ.. 7న ఖమ్మం జిల్లాలోని ఏ న్కూరులో ఆమెను పోలీసులు అదుపులోకి తీ సుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి శుక్రవారం కోర్టులో హాజరుపరిచేవరకు కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్‌పీఎఫ్ నివాస సముదాయాల్లో ఆమెను విచారించినట్లు తెలుస్తోంది.

 మిస్డ్ కాల్‌తో పరిచయం
 కాజీపేటలోని ఫాతిమానగర్‌లో సన బ్యాంగిల్‌స్టోర్‌ను నిర్వహించేది. మిస్‌డ్‌కాల్ ద్వారా ఆమె కు అనిల్‌తో పరిచయమైంది. దీంతో అనిల్ సనను రెండో వివాహం చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు. తొలిసారి కాన్పు అయ్యే వరకు అనిల్ మాజీ ఎంపీ రాజయ్య కొడుకని, అతనికి అప్పటికే సారికతో వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయం సనకు తెలి యదు. నిజం తెలిసినప్పటి నుంచి అనిల్, సన ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆఖరికి అనిల్‌తో విడిపోయేందుకు సనకు రూ. 10 లక్షలు ఇచ్చేందుకు రాజయ్య కుటుంబం అంగీ కరించింది. సన తరఫున బంధువు చనిపోవడంతో ఈ చెల్లింపులో జాప్యం జరిగింది. ఇం తలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు.
 
 అనిల్‌ను కస్టడీకి ఇవ్వండి
కోర్టులో పోలీసుల పిటిషన్

 వరంగల్ లీగల్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు, ముగ్గురు మనువళ్లు సజీవ దహనమైన కేసులో ప్రధాన నిందితుడైన సారిక భర్త సిరిసిల్ల అనిల్‌కుమార్‌ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సుబేదారి పోలీసులు కోరారు. నగరంలోని నాల్గవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈమేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులైన అనిల్‌కుమార్, మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిలను అరెస్టు చేయగా, జైలులో ఉన్నారని, నాలుగో ముద్దాయి సనను శుక్రవారం అరె స్టు చేశామని పిటిషన్‌లో పేర్కొన్నారు.

నలుగురు ముద్దాయిలు మాట్లాడిన మాటలను మృతురాలి సెల్‌ఫోన్‌లో రికార్డు అయి ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, మరింత సమాచారం సేకరించడానికి అనిల్‌కుమార్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. నిందితుడి నుంచి మరిన్ని దస్తావేజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, విస్త్రృత ప్రజాప్రయోజన దృష్ట్యా కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement