సామర్లకోట –వేమగిరి రోడ్డు మరమ్మతులకు చర్యలు | samalkota- vemagiri road patch works | Sakshi
Sakshi News home page

సామర్లకోట –వేమగిరి రోడ్డు మరమ్మతులకు చర్యలు

Oct 24 2016 9:30 PM | Updated on Aug 30 2018 4:10 PM

జిల్లాలో అధ్వానంగా మారిన సామర్లకోట –వేమగిరి ఆర్‌ అండ్‌బీ రహదారి మరమ్మతులకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. సోమవారం ఈ రహదారి విషయమై ఆ శాఖ ఎండీ జగన్నాథరావు అ«ధికారులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారని ఈఈ కేఎస్‌ రాఘవరావు వెల్లడించారు. రహదారికి తాత్కాలిక మరమ్మతుల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ రహదారి 45 కిలోమీటర్ల పొడవునా మరమ్మతులు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపార

భానుగుడి (కాకినాడ) : 
జిల్లాలో అధ్వానంగా మారిన సామర్లకోట –వేమగిరి ఆర్‌ అండ్‌బీ రహదారి మరమ్మతులకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. సోమవారం ఈ రహదారి విషయమై ఆ శాఖ ఎండీ జగన్నాథరావు అ«ధికారులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారని ఈఈ కేఎస్‌ రాఘవరావు వెల్లడించారు. రహదారికి తాత్కాలిక మరమ్మతుల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ రహదారి 45 కిలోమీటర్ల పొడవునా మరమ్మతులు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. సబ్‌డివిజన్లుగా ఈ పనులు ప్రారంభిస్తున్నామని, సామర్లకోట– బిక్కవోలు సబ్‌డివిజ¯ŒS రహదారికి రూ.2కోట్లు, బిక్కవోలు– అనపర్తి రహదారికి రూ.2కోట్లు, అనపర్తి–ద్వారపూడి రూ.2కోట్లు,  ద్వారపూడి –వేమగిరి రహదారి నిర్మాణానికి రూ.2కోట్లు మరమ్మతుల నిమిత్తం వెచ్చించాలని ప్రతిపాదించామన్నారు. టెండర్లు పిలిచి డిసెంబరు నాటికి పనులను పూర్తి చేస్తామన్నారు..ఈ రహదారి నిర్మాణం కోరుతూ గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేక ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement