సాక్షి నెల్లూరు: మమ్మిడివరం మండలం కోమానిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 216పై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని వెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ తీవ్రతతో బస్సు ముందుబాగం నుజ్జునుజ్జయ్యింది.


