ముఖ్యమంత్రి చంద్రబాబు తన నటనాచాతుర్యంతో అందరినీ విస్మయపరిచారు. విశాఖ సముద్రతీరం వేదికగా.. ఏడు హై ఎండ్ కెమెరాలు, ఓ డ్రోన్ కెమెరా సాక్షిగా శనివారం హంగామా చేశారు. సామాన్యులను అనుమతించకుండా చిత్రీకరించిన టోటల్ ఎపిసోడ్‌ను రక్తికట్టించారు. ప్రత్యేకంగా చల్లిన చెత్తను ఎత్తి.. మూడు మురి మిక్చర్ బండ్లతో అందంగా ముస్తాబు చేసిన సెట్‌లో కాసేపు మాటామంతీ సాగించారు. జీవీఎంసీ కార్మికులు.. ముందే అద్దంలా శుభ్రం చేసిన సాగర తీరంలో స్వేదబిందువులు చిందించి నవ్వులు పండించారు. సన్ని‘వేశాల’ చిత్రీకరణ పూర్తికాగానే ప్యాకప్ చెప్పేసి కాన్వాయ్‌లో మాయమైపోయారు. ఇంకేముంది.. ఆ వెంటనే అధికారులు, పారిశుధ్య కార్మికులతో పాటే మురి మిక్చర్ బండ్లు మాయం.. ఆఖరికి బాబూ.. నిన్ను చూసి.. మైమరిచి.. శు‘భ్రమే’.. అది సిత్రమే అని పాడుకోవడం విశాఖ వాసి వంతైంది.

శనివారం తెల్లవారుజామునే జీవీఎంసీ కార్మికుల కష్టంతో అద్దంలా తయారైన విశాఖ బీచ్

సీఎం ఏరడం కోసం ప్రత్యేకంగా చెత్త, ఖాళీ బాటిళ్లు, కవర్లు చల్లుతున్న కార్మికులు

ఏడు కెమెరాలు రోలై.. డ్రోన్ కెమెరా పైకెగరగానే షాట్‌కు సిద్ధమైన సీఎం చంద్రబాబు

స్లోమోషన్‌లో చెత్తను ఎత్తుతూ.. బాబు ఫొటో షూట్

మురి మిక్చర్ బండ్ల సెట్ వద్ద మహిళతో మాటామంతి

బాబు వెళ్లిపోగానే మురి మిక్చర్ బండిని ఎత్తేస్తున్న కార్మికులు


