breaking news
acting chief ministers
-
శు‘భ్రమే’.. అది సిత్రమే!
ముఖ్యమంత్రి చంద్రబాబు తన నటనాచాతుర్యంతో అందరినీ విస్మయపరిచారు. విశాఖ సముద్రతీరం వేదికగా.. ఏడు హై ఎండ్ కెమెరాలు, ఓ డ్రోన్ కెమెరా సాక్షిగా శనివారం హంగామా చేశారు. సామాన్యులను అనుమతించకుండా చిత్రీకరించిన టోటల్ ఎపిసోడ్‌ను రక్తికట్టించారు. ప్రత్యేకంగా చల్లిన చెత్తను ఎత్తి.. మూడు మురి మిక్చర్ బండ్లతో అందంగా ముస్తాబు చేసిన సెట్లో కాసేపు మాటామంతీ సాగించారు. జీవీఎంసీ కార్మికులు.. ముందే అద్దంలా శుభ్రం చేసిన సాగర తీరంలో స్వేదబిందువులు చిందించి నవ్వులు పండించారు. సన్ని‘వేశాల’ చిత్రీకరణ పూర్తికాగానే ప్యాకప్ చెప్పేసి కాన్వాయ్‌లో మాయమైపోయారు. ఇంకేముంది.. ఆ వెంటనే అధికారులు, పారిశుధ్య కార్మికులతో పాటే మురి మిక్చర్ బండ్లు మాయం.. ఆఖరికి బాబూ.. నిన్ను చూసి.. మైమరిచి.. శు‘భ్రమే’.. అది సిత్రమే అని పాడుకోవడం విశాఖ వాసి వంతైంది. శనివారం తెల్లవారుజామునే జీవీఎంసీ కార్మికుల కష్టంతో అద్దంలా తయారైన విశాఖ బీచ్ సీఎం ఏరడం కోసం ప్రత్యేకంగా చెత్త, ఖాళీ బాటిళ్లు, కవర్లు చల్లుతున్న కార్మికులు ఏడు కెమెరాలు రోలై.. డ్రోన్ కెమెరా పైకెగరగానే షాట్‌కు సిద్ధమైన సీఎం చంద్రబాబు స్లోమోషన్లో చెత్తను ఎత్తుతూ.. బాబు ఫొటో షూట్ మురి మిక్చర్ బండ్ల సెట్ వద్ద మహిళతో మాటామంతి బాబు వెళ్లిపోగానే మురి మిక్చర్ బండిని ఎత్తేస్తున్న కార్మికులు ChandrababuChandrababu -
‘తాత్కాలిక’ సీఎంలుగా మిగిలిన ఆ ఇద్దరు
ఆదివారం రాజీనామా చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) రాష్ట్ర చరిత్రలో మూడు సార్లు ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’ పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. కిందటి డిసెంబర్లో ఏఐడీఎంకే నాయకురాలు, సీఎం జె.జయలలిత మరణించాక ఆయన ముచ్చటగా మూడోసారి ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’గా ప్రమాణం చేశారు. అంతకు ముందు జయ కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవికి తొలిసారి రాజీనామా చేసినప్పుడు 2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి ఒకటి వరకూ తాత్కాలిక హోదాతో సీఎంగా పనిచేశారు. రెండోసారి కూడా న్యాయపరమైన చిక్కుల కారణంగా(జైలు శిక్ష పడినప్పుడు) జయలలిత రాజీనామా చేశాక పన్నీర్‌సెల్వం 2014 సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకూ సీఎం పదవిలో ఉన్నారు. ఏఐడీఎంకే మాతృక డీఎంకే 1967లో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే పార్టీ నేత సీఎన్ అన్నాదురై మరణించాక పన్నీర్‌సెల్వం మాదిరిగానే సీనియర్ మంత్రి వీఆర్ నెడుంజెళియన్ 1969 ఫిబ్రవరి 3 నుంచి పది వరకూ తొలిసారి తాత్కాలిక సీఎంగా పనిచేశారు. మళ్లీ 1987 డిసెంబర్లో ఏఐఏడీఎంకే పార్టీ స్థాపకుడు, సీఎం ఎంజీ రామచంద్రన్ మరణించాక డిసెంబర్ 24 నుంచి జనవరి 7 వరకూ రెండోసారి తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి నెడుంజెళియన్‌ను తొలగించి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకికి సీఎం పదవి అప్పగించారు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కోసం ఓపీఎస్‌తో రాజీనామా చేయించడం 30 ఏళ్ల నాటి నెడుంజెళియన్ ఉద్వాసనను గుర్తుచేస్తోంది. ఇలా నెడుంజెళియన్, పన్నీర్సెల్వలు తమిళనాడులో ఇద్దరు తాత్కాలిక సీఎంలుగా చరిత్రలో మిగిలిపోతారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)


