రుణమాపీ ఒకేసారీ చేపట్టాలి | Runamapi should okesari | Sakshi
Sakshi News home page

రుణమాపీ ఒకేసారీ చేపట్టాలి

Jul 26 2016 5:57 PM | Updated on Oct 1 2018 1:21 PM

రుణమాపీ ఒకేసారీ చేపట్టాలి - Sakshi

రుణమాపీ ఒకేసారీ చేపట్టాలి

రైతు రుణమాఫీని ఒకేసారి చేపట్టి కొత్త రుణాలు మంజూరు చేయాలంటూ అఖిలపక్షం ఆధర్యంలో మంగళవారం కేంద్ర సహకార బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు.

కేంద్రసహకార బ్యాంకు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
రామాయంపేట: రైతు రుణమాఫీని ఒకేసారి చేపట్టి కొత్త రుణాలు మంజూరు చేయాలంటూ అఖిలపక్షం ఆధర్యంలో మంగళవారం కేంద్ర సహకార బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, టీటీడీపీ, బీజేపీ  కార్యకర్తలు బ్యాంకు వద్దకు చేరుకొని  నినాదాలు చేశారు. ఈసందర్భగా కాం‍గ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సరాపు యాదగిరి, బీజేపీ జిల్లా నాయకుడు వెల్ముల సిద్దరాంలు  మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులపాలవుతున్నారన్నారు.

ఇప్పటివరకు మూడో విడత  రుణమాఫీ నిధులు మంజూరు కాకపోడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడంలేదన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సుధాకర్‌రెడ్డి, రఘుపతిగౌడ్,  శీలం క్రిష్ణారెడ్డి, చింతల క్రిష్ణ, చింతల శ్రీనివాస్, ఎనిశెట్టి అశోక్, నవాత్‌ నగేశ్, రమేశ్‌రెడ్డి, హస్నొద్దీన్, విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement