ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి రెండు ఇళ్లు దగ్ధం అయ్యాయి.
రెడ్డిగూడెం(కృష్ణా): ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి రెండు పూరిళ్లు ఇళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో ఇంటిలో ఉన్న రూ. 62 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో.. మంటలు ఎగిసిపడి రెండు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా.. అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం.