రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Rs.10 lakhs of red scandels seized by police in chittoor district | Sakshi
Sakshi News home page

రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Apr 18 2016 1:03 PM | Updated on Aug 21 2018 6:12 PM

చిత్తూరు జిల్లాలోని కండ్రిగ మండలం కారనిమిట్టలో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కండ్రిగ మండలం కారనిమిట్టలో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు. అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు సోమవారం కారనిమిట్టలోని మామిడి తోటలో ఎర్రచందనం డంపింగ్పై దాడులు చేశారు. దాంతో పోలీసులపై స్మగ్లర్లు దాడికి పాల్పడటంతో ఏడుగురి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో ఐదుగురు పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం, మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement