breaking news
red scandels
-
రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కండ్రిగ మండలం కారనిమిట్టలో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు. అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు సోమవారం కారనిమిట్టలోని మామిడి తోటలో ఎర్రచందనం డంపింగ్‌పై దాడులు చేశారు. దాంతో పోలీసులపై స్మగ్లర్లు దాడికి పాల్పడటంతో ఏడుగురి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం, మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
14 ఎర్రచందనం దుంగల పట్టివేత
చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 14 ఎర్రచందనం దుంగలను తరలించడానికి కూలీలు సిద్ధంగా ఉన్నారు. పోలీసులను చూసి కూలీలు పరారవగా ఒక్క కూలీ మాత్రం పట్టుబడ్డాడు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.