జేసీ బ్రదర్స్ తో ఆర్పీ | rp patnaik in tadipatri | Sakshi
Sakshi News home page

జేసీ బ్రదర్స్ తో ఆర్పీ

Oct 9 2016 10:47 PM | Updated on Sep 4 2017 4:48 PM

జేసీ బ్రదర్స్ తో ఆర్పీ

జేసీ బ్రదర్స్ తో ఆర్పీ

ఊరు చాలా బాగుందీ.. గాయిత్రీ ఆలయంలో దసరా ఉత్సవాలు బాగా జరుపుతున్నారు.. వచ్చే ఏడాది నా ఆధ్వర్యంలో తాడిపత్రి గాయిత్రీ ఆలయంలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తానని సినీహీరో, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌ పేర్కొన్నారు.

– జేసీ సోదరులకు కలిసిన సినీహీరో, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌
తాడిపత్రి టౌన్‌ : ఊరు చాలా బాగుందీ.. గాయిత్రీ ఆలయంలో దసరా  ఉత్సవాలు బాగా జరుపుతున్నారు.. వచ్చే ఏడాది  నా ఆధ్వర్యంలో తాడిపత్రి గాయిత్రీ ఆలయంలో  సాంస్కతిక కార్యక్రమాలు  నిర్వహిస్తానని సినీహీరో, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌ పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణం సంజీవనగర్‌లోని  గాయిత్రీ ఆలయంలో జరుగుతున్న  శరన్నరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గాయిత్రీమాతన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ ఆవరణంలో సాంస్కతిక కార్యక్రమాలను వారు తిలకించారు. అంతకు ముందు జేసీ  ఇంటిలో  ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలను ఆర్‌పీ పట్నాయక్‌ కలిశారు. తాడిపత్రి ఊరు చాలా బాగుంది. స్వచ్ఛభారత్‌లో దేశ స్థాయిలో రెండవ అవార్డు రావడం పత్రికల్లో చూశామని ఆర్‌పీ జేసీ సోదరులతో అన్నారు. నేను హీరోగా ‘మనలో ఒకడు ’ చిత్రం ఈనెల 28వ తేదీ విడుదల కానున్నదని, ఈ సినిమా అంతా జర్నలిస్టులకు సంబంధించిన సినిమా అని ఆర్‌పీ తెలిపారు. ఆయన వెంట సినీ రచయిత బాలజీ, టీడీపీ నాయకులు ఎస్పీ రవీంద్రారెడ్డి  ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement