ఈవోఆర్డీ ఇంట్లో చోరీ | roberry in eord house | Sakshi
Sakshi News home page

ఈవోఆర్డీ ఇంట్లో చోరీ

Aug 5 2016 11:30 PM | Updated on Sep 4 2017 7:59 AM

ఏలూరు అర్బన్‌ : నగరంలోని ఒక అపార్ట్‌మెంటులో చోరీ జరిగింది. ఫ్లాట్‌ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు 17 కాసుల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు.

ఏలూరు అర్బన్‌ :  నగరంలోని ఒక అపార్ట్‌మెంటులో చోరీ జరిగింది. ఫ్లాట్‌ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు 17 కాసుల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు ఈవోఆర్డీగా పనిచేస్తున్న ఎం.మురళికృష్ణ, మధులత దంపతులు స్థానిక రామకృష్ణాపురం మినీబైపాస్‌ రోడ్డులో ఉన్న గీతా అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. మధులత జిల్లా కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం వారిద్దరూ యథావిధిగా ఫ్లాట్‌కు తాళాలు వేసుకుని డ్యూటీకి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి అగంతకులు ఫ్లాట్‌ తాళాలు పగులగొట్టి బీరువా తెరిచి అందులో ఉన్న 17 కాసుల బంగారు నగలు అపహరించుకుపోయారు, దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్‌ ఎసై ్స ఎం.సాగర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్‌ టీమ్‌ను రప్పించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
  
 
 
 
 
  
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement