వినాయక నిమజ్జనానికి వెళ్లి వచ్చేసరికి.. | robbery in guntur district | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనానికి వెళ్లి వచ్చేసరికి..

Sep 18 2016 8:23 AM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు.

గుంటూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి... గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపును చూసేందుకు వెళ్లారు.

ఇదే అదనుగా భావించిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 70 సవర్ల బంగారంతోపాటు రూ. 25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన వెంకటేశ్వరరెడ్డి కుటుంబసభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement